హాలీవుడ్ యాక్టర్ బ్రాడ్ పిట్ పేరుతో ఓ స్కామర్ ఫ్రెంచ్ మహిళ(53) నుంచి భారీగా నగదు కాజేశాడు. ఆన్లైన్ ద్వారా పరిచయం పెంచుకొని AI ఫొటోలు పంపి ఆమెను నమ్మించాడు. ఈ మేరకు ఆమెతో 2023 నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. ఏంజెలినా జూలీతో డివోర్స్ వివాదం వల్ల క్యాన్సర్ చికిత్సకు సొంత డబ్బుల్ని వాడుకోలేకపోతున్నానని చెప్పి మహిళ నుంచి రూ. 7cr రాబట్టాడు. తాను మోసపోయానని తెలుసుకున్న మహిళ డిప్రెషన్ తో ఆస్పత్రి పాలయింది. అధికారులకు ఫిర్యాదు చేసింది.