లోయలో దూకిన వ్యక్తి.. షాకైన శ్రీవారి భక్తులు

79பார்த்தது
లోయలో దూకిన వ్యక్తి.. షాకైన శ్రీవారి భక్తులు
AP: తిరుమలలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేగింది. అందరూ చూస్తుండగా అవ్వచారి కోన లోయలోకి దూకారు. అలిపిరి మెట్ల మార్గంలో వచ్చిన వ్యక్తి.. అక్కగార్ల ఆలయం వద్దకు రాగానే లోయలోకి దూకేశారు. దీంతో విజిలెన్స్ పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. లోయలోకి దూకిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. తాడు సాయంతో లోయలోకి వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి స్థానిక సీసీ ఫుటేజులు పరిశీలించారు.

தொடர்புடைய செய்தி