TG: హైదరాబాద్ నగరం వెలుపల ముచ్చర్ల ప్రాంతంలో ఏర్పాటయ్యే ఫోర్త్ సిటీలో మరో జూపార్కు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఫోర్త్ సిటీలో 15 వేల ఎకరాలకుపైగా రెవెన్యూ భూమి ఉన్న నేపథ్యంలో అక్కడ నెలకొల్పాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రకృతి పర్యాటకం అభివృద్ధికి జూపార్కుతో పాటు నైట్ సఫారీ వంటివి ఏర్పాటు చేయాలని ఇటీవల జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.