ఉత్తరప్రదేశ్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి జేపీ గ్రీన్స్ తాము విక్రయించే రూ.26 కోట్ల విలువైన విల్లాను కొనుగోలు చేసే కస్టమర్లకు లంబోర్గిని ఉరుస్ కారును ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు. విల్లాలో ఉండేవారికి ఇతర విలాసవంతమైన సౌకర్యాలు (పార్కింగ్, స్విమ్మింగ్ ఫూల్, థియేటర్, క్లబ్ మెంబర్ షిప్, గోల్ఫ్ కోర్స్) కోసం అదనంగా రూ.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని ట్వీట్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.