TG: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తున్న మహిళలపైకి ఓ కారు అదుపు తప్పి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా.. 20 మందికి గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దీంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.