తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ ఉప్పల్‌లో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. చిలకనగర్‌లోని డాక్స్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని సంజన ఉరివేసుకొని మృతి చెందింది. గతకొద్ది రోజులుగా సంజన కడుపునొప్పితో బాధపడుతున్నట్లు విద్యార్థి తలిదండ్రులు తెలిపారు.