బర్త్ డే వేడుకల్లో ఫుడ్ తిని.. 76 మందికి అస్వస్థత (వీడియో)

52பார்த்தது
పుట్టినరోజు వేడుకల్లో భోజనం తిని 76 మంది అస్వస్థత గురయ్యారు. ఈ ఘటన యూపీలోని గోండాలో చోటుచేసుకుంది. బెల్సర్‌ డెవలప్‌మెంట్‌ బ్లాక్‌ పరిధిలోని జబర్‌నగర్‌ తివారీ పూర్వాలో పుట్టినరోజు వేడుకల్లో భోజనం తిన్న 76 మంది వాంతులు, విరేచనాలు, జ్వరం బారిన పడ్డారు. వైద్యులు గ్రామానికి చేరుకుని మందికి చికిత్స అందిస్తున్నారు. ఆహార నమూనాలను పరీక్షల నిమిత్తం పంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி