గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులను తీవ్రతరం చేసింది. దీని వల్ల గత 24 గంటల్లో 62 మంది పాలస్తీనీయులు మరణించినట్లు గాజా అధికారులు ప్రకటించారు. వీరిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. దక్షిణ గాజాలోని, ఖాన్ యూనిస్లో పునరావాస కేంద్రాలపై జరిగిన దాడుల్లో ఐదుగురు శరణార్థులు చనిపోయారని పేర్కొన్నారు. కాగా కాల్పుల విరమణను ఉల్లంఘించిన ఇజ్రాయెల్‌ను అడ్డుకోవాలని అంతర్జాతీయ సమాజానికి హమాస్ విజ్ఞప్తి చేసింది