ముత్తారం కేజీబీవీలో 60 మంది విద్యార్థినులకు అస్వస్థత (వీడియో)

78பார்த்தது
పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆదివారం రాత్రి దాదాపు 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు వారిని పెద్దపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, అస్వస్థతకు గల కారణాలను ఇంకా గుర్తించలేదు. ఫుడ్‌ పాయిజన్‌ జరిగిందా? లేక ఇటీవల పాఠశాల పరిధిలో కొట్టిన గడ్డి మందు వల్ల ఈ పరిణామం చోటు చేసుకుందా.. అనేది అధికారులు ఆరా తీస్తున్నారు.

தொடர்புடைய செய்தி