శబరిమలకు అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. పెద్ద సంఖ్యలో మాలధారులు రావడంతో స్వామివారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. సన్నిధానం నుంచి పంబ వరకు అయ్యప్ప భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. మండల పూజ ప్రారంభం కావడంతో శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ట్రావెన్కోర్ ఆలయ కమిటీ తగిన ఏర్పాట్లు చేస్తోంది.