Mar 31, 2025, 16:03 IST/
రాజస్థాన్ కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య
Mar 31, 2025, 16:03 IST
రాజస్థాన్‌లోని కోటా నగరంలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏప్రిల్ 2న పరీక్షకు హాజరు కావాల్సిన విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. కాన్పూర్‌కు చెందిన ఉజ్వల్ మిశ్రా (18) అనే విద్యార్థి జేఈఈకి రెండేళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నాడు. అయితే ఆదివారం ఉజ్వల్ హాస్టల్ నుంచి వెళ్లి రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.