Feb 23, 2025, 09:02 IST/
ఏపీలో ఆగని బర్డ్ ప్లూ.. నాటు కోళ్లకు వైరస్!
Feb 23, 2025, 09:02 IST
ఏపీలో బర్డ్ ప్లూ తీవ్ర కలకలం రేపుతోంది. గోదావరి జిల్లాలో ఇప్పటికే లక్షల సంఖ్యలో ఫారం కోళ్లు మృతి చెందాయి. అయితే ఇప్పుడు ఫారం కోళ్ళకే కాకుండా నాటు కోళ్ళకు బర్డ్ ప్లూ సోకుతుంది. గత 15 రోజుల నుంచి 95 గ్రామాల్లో నాటు పెట్టలతో పాటు లక్షలు విలువచేసే పందెం కోళ్ళు సైతం చనిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అంబేద్కర్ కోనసీమజిల్లాలో అధిక సంఖ్యలో నాటు కోళ్ళు చనిపోయినట్లు అధికారులు తెలిపారు.