Oct 10, 2024, 01:10 IST/జగిత్యాల
జగిత్యాల
నవదుర్గ పీఠంలో శాకాంబరి దేవిరూపంలో అమ్మవారు
Oct 10, 2024, 01:10 IST
జగిత్యాల పట్టణంలోని గోవిందుపల్లెలో గల నవదుర్గపీఠంలో దేవి నవరాత్రులలో భాగంగా బుధవారం అమ్మవారిని వివిధరకాల కూరగాయలతో అలంకరించారు. భక్తులకు శాకాంబరి దేవిగా దర్శనమిచ్చారు. అనంతరం నవదుర్గ సమితి సభ్యులు బతుకమ్మ వేడుకలు నిర్వహించగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.