AP: కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేములలో శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. వేముల తహసీల్దార్ కార్యాలయం వద్ద వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. సాగునీటి సంఘాల ఎన్నికల విషయంపై మాట్లాడేందుకు తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లేందుకు కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రయత్నించారు. దాంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. అవినాష్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.