యర్రగుంట్ల-వేంపల్లి రోడ్డులోని సబ్ స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 బైకులు ఢీకొనడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. శనివారం జరిగిన ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆర్టీపీపీ (రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్)లో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న కిరణ్ బాబు గా గుర్తించారు. తీవ్ర గాయాల కారణంగా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.