వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసుల విచారణలో అతడు వైసీపీ పెద్దల పేర్లు చెప్పినట్లు సమాచారం. చంద్రబాబు, పవన్ కల్యాణ్, కూటమి నేతల కుటుంబ సభ్యులపై అసభ్య, అభ్యంతరక పోస్టులను సోషల్ మీడియాలో పెట్టిన వర్రా రవీంద్రా రెడ్డిని పోలీసులు ఆదివారం ఉదయం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఐప్యాక్ టీమ్ కంటెంట్ ఇస్తే ఫేస్ బుక్ లో పోస్ట్ చేసినట్లు అతడు విచారణలో వెల్లడించాడు.