ఏలూరు: ఆడపిల్లల భద్రత విషయంలో అలసత్వం వహిస్తే క్షమించేది లేదు
ఏలూరు అమీనా పేటలోని అంబేద్కర్ సైన్స్ పార్క్ వద్ద ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహం అమీనాపేట ఏలూరు బీసీ, ఎస్టీ గురుకుల పాఠశాలను, హాస్టల్స్ ను, వసతి గృహాలను జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డల మాన, ప్రాణ రక్షణలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలమేరకు మేమంతా కృత నిశ్చయంతో, చిత్తశుద్దితో ఉన్నామన్నారు.