తణుకు: ప్రజా సమస్యల పరిష్కరించడమే ప్రజాదర్బార్ ధ్యేయం
ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడమే ధ్యేయంగా 'ప్రజా దర్బార్' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. గురువారం తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు