ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిహెచ్ ద్వారకా తిరుమల రావు గురువారం ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం గొండపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా 76 ఎకరాల్లో అక్టోపస్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణ ప్రతిపాదనకు గాను ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. అదే విధంగా తోటపల్లి గ్రామంలో 498.23 ఎకరాల్లో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణ ప్రతిపాదన కోసం తోటపల్లి ప్రాంతాన్ని సందర్శించారు.