ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏలూరులో మహిళా ఉద్యోగులకు శుక్రవారం పోష్ యాక్ట్ నిర్వహించారు. విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల నిరోధంపైన అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్న ప్రసాద్ మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలపైన లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటిని అరికట్టడానికి పోష్ యాక్ట్ తేవడం జరిగిందన్నారు.