ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. శుక్రవారం ఏలూరు క్యాంపు కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఆయన వాటికి పరిష్కార మార్గాలు చూపారు. తాను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా తనను నేరుగా కలుసుకోవచ్చునని తెలిపారు.