ఏలూరు నగరంలో బుధవారం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. దీంతో రహదారులపై వర్షపు నీరు పొంగిపొర్లింది. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే దీపావళి నేపథ్యంలో ఏర్పాటు చేసిన బాణాసంచా దుకాణాలు వర్షం రాకతో వెలవెలబోతున్నాయి. ఈ సందర్భంగా దుకాణదారులు డీలా పడిపోయారు.