ఏలూరు: బాల్య వివాహల నిర్మూలనకు కృషి చేయాలి
బాల్యవివాహాల వల్ల కలిగే అనర్ధాలపై విద్యార్ధినిలకు అవగాహన కల్పించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో గురువారం మిషన్ వాత్సల్య 2వ త్రైమాసిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్ధ కార్యదర్శి రత్న ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిర్మూలనకు టోల్ ఫ్రీనెం. 1098ను మరింత విస్త్రృత పరచాలన్నారు.