ఏలూరు జిల్లాలో 664 గ్రామాల్లలో రీసర్వే చేయవలసి ఉండగా అందులో ఇప్పటివరకు 252 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి తెలిపారు. రీ సర్వే పూర్తి అయిన గ్రామాల్లో ఈనెల 18వ తేదీ నుంచి నవంబరు 14వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించబడతాయన్నారు. కావున భూ యాజమానులకు రీ సర్వే అయిన భూములపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చన్నారు.