ఏలూరు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గంట పద్మశ్రీ ప్రసాద్ గురువారం జడ్పీ క్యాంపు కార్యాలయంలో జిల్లా పంచాయతీ అధికారి అనురాధతో సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలో జరుగుతున్న పారిశుధ్య కార్యకలాపాలు, మంచి నీటి సరఫరా పథకాల నిర్వహణ స్థితి, పలు అంశాలపై చర్చించడం జరిగింది. అనంతరం పలు సూచనలు సలహాలు అందజేశారు.