దెందులూరు ఎమ్మెల్యేపై కేసులు కొట్టివేత
పెదవేగి, పెదపాడు మండలాల్లో ఎమ్మెల్యే చింతమనేనిపై నమోదైన రెండు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ఏలూరు జిల్లా కోర్టు కొట్టి వేస్తున్నట్లు గురువారం వెల్లడించింది. గత ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ సూచనల మేరకు పలు తప్పుడు కేసుల మోపారని చింతమనేని అన్నారు. భారీగా తప్పుడు కేసులు నమోదు చేసి ఎలాగైనా లొంగదీయలనీ ఎన్నో విధాలుగా అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ ఆత్మవిశ్వాసంతో నిలబడ్డామని అన్నారు.