దెందులూరు: 50% సబ్సిడీపై టార్ఫాలిన్లు అందించాలి
రైతులకు, కౌలు రైతులకు 50% సబ్సిడీపై టార్ఫాలిన్లు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం దెందులూరు మండలంలోని సత్యనారాయణపురం, ఉండ్రాజవరం గ్రామాలలో పర్యటించి కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని పరిశీలించారు. తేమ శాతం నిబంధన సడలించి వాయుగుండం నేపథ్యంలో ధాన్యం యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని, వరి మిషన్ కోత కిరాయిలు నియంత్రించాలని కోరారు.