కోడిపందాలు, జూదం వంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్ అన్నారు. పెదవేగి పోలీస్ స్టేషన్ను డీఎస్పీ ప్రసాద్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. డివిజన్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయడం జరిగిందని, అలాగే ఎవరైనా కోడిపందాలు, వంటి వాటిని ఏర్పాటు చేసినా, నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.