వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ తప్పదనే ప్రచారం ఊపందుకుంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరును చేర్చడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. దీంతో కేడర్లోనూ అరెస్ట్ చేస్తారనే అనుమానం బలపడింది. అయితే ఈ వ్యవహారంలో కేటీఆర్ సైతం అలర్ట్ అయినట్లు సమాచారం. మాజీ మంత్రులతో భేటీ అయి అరెస్టు తరువాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించినట్టు తెలుస్తోంది.