పెదవేగి మండలం కవ్వగుంట గ్రామంలో సోమవారం గ్రామస్తులు ధర్నాకు దిగారు. జీవన ఉపాధి కోసం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చి పనులు చేసుకుంటున్న తమపై స్థానికులు దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలకు వెళ్లే తమ పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ రాస్తారోకో చేశారు. దీంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.