పెదవేగి: కుటుంబం మరణం తట్టుకోలేక భార్య మృతి
పెదవేగి మండలం కవ్వగుంట గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఇటీవల పందెం కోడికి ఈత నేర్పుతూ. ప్రమాదవశాత్తు తండ్రీకుమారులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా కుటుంబంలో అందరినీ కోల్పోవడం జీర్ణించుకోలేక తల్లి కూడా శుక్రవారం కన్నుమూసింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.