యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రైమరీ, మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఏపీ బీసీ సంక్షేమ శాఖ తెలిపింది. అర్హత గల బీసీ, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు ఈ నెల 24లోపు బీసీ సంక్షేమ సాధికార కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని వెల్లడించింది. ఈ నెల 27న నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి కోచింగ్ ఇస్తామని పేర్కొంది. హాస్టల్, భోజన వసతి కూడా ఉంటుంది. బీసీలకు 66 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 14 శాతం చొప్పున ఎంపిక చేస్తారు.