AP: వైఎస్ జగన్ కుటుంబీకుల గురించి తాము ఏనాడూ తప్పుగా మాట్లాడలేదన్న మంత్రి నారా లోకేశ్‌కు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. పలు సందర్భాల్లో మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలను వీడియో రూపంలో ఎక్స్‌లో పోస్టు చేసింది. ‘తండ్రి చంద్రబాబును మించిన అబద్ధాలకోరు ఈ ఊసరవెల్లి లోకేశ్ అని తేలింది. గతంలో జగన్ కుటుంబం గురించి నీచంగా మాట్లాడి.. ఇప్పుడు తాను అమాయకుడిని అంటూ బుకాయిస్తున్నాడు.’ అని వైసీపీ మండిపడింది.