AP: కోనసీమ జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మహాసేన రాజేశ్, అతడి అనుచరులు వేధిస్తున్నారని శంకరగుప్తం గ్రామానికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో రాజేశ్‌తో పాటు నలుగురు అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.