జీలుగుమిల్లి మండల కేంద్రంలో ఉన్న సి. ఆర్. ఆర్ కాలనీకి వెళ్లడానికి రహదారి పూర్తిగా పాడైపోయి ఉందని, స్థానికులు రహదారికి మరమ్మతులు చేయించాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజుని ఇటీవల కోరడం జరిగింది. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే తన సొంత నిధులతో మంగళవారం రహదారి మరమ్మతులకు పనులు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.