ఏలూరు జిల్లా కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని పలు రికార్డులను తనిఖీ చేశారు. అలాగే రికార్డుల నిర్వహణపై అవగాహన కల్పించి, సరిహద్దు గ్రామాలపై ప్రత్యేక నిఘా వేయాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. లోన్ యాప్, సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, స్టేషన్లకు వచ్చే పిటీషనర్ల పట్ల మర్యాదగా వ్యవహరించాలని తెలిపారు.