జిల్లాలో ప్రస్తుతం ప్రారంభమైన సారవ పంట మాసూలు ధాన్యం కొనుగోలు సమయంలో రైతుసేవా కేంద్రాల్లో నిర్థారించిన తేమశాతం, నూకశాతం, తరుగు శాతాన్నె రైస్ మిల్లర్లు పరిగణనలోకి తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఈసందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కమార్ రెడ్డికి సంఘం ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం అందజేశారు.