రోడ్లపై గుంతలు పూడిక నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రహదారులు గుంతలు పూడిక పనులలో భాగంగా భీమవరం మండలం చిన్న తమిళం ఇండియన్ బ్యాంక్ వద్ద గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనులలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలన్నారు.