ఏలూరు: పోలీస్ పబ్లిక్ గ్రీవెన్స్ లో 32 ఫిర్యాదులు
ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుండి వచ్చిన ఫిర్యాదులలో ఎక్కువగా భూ తగాదాలు, ఆస్తి సంబంధమైన విషయాలు, కుటుంబ సంబంధమైన వివాదాలపై అధిక ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన తెలిపారు. అలాగే సుమారు 32 ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామన్నారు.