ఏలూరు: ఈనెల 26న కలెక్టరేట్ వద్ద ధర్నా

51பார்த்தது
రైతాంగ సమస్యలు పరిష్కరించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి ఇచ్చిన హామీ అమలు చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కె. శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు, కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం ఈనెల 26న ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నాను విజయవంతం చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி