ఏలూరు: సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ
పేదవారికి ఖరీదైన వైద్యసేవలు అందుబాటులో ఉండాలనే సదాలోచనతో కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం 12, 13, 15 డివిజన్లకు చెందిన గాదంశెట్టి శ్రీలక్ష్మికి రూ.. 75, 000, కంచరపు దేవేంద్రరావుకు ₹. 1, 28, 285, ముక్కామల రాణికి రూ. 1, 62, 000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.