ఏలూరు: చేనేత వర్గాలకు పూర్వ వైభవం తెస్తాం - మంత్రి సవిత
చేనేత వర్గాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత పేర్కొన్నారు. గురువారం ఏలూరు టిటిడి కళ్యాణ మండపం సమీపంలోని ఆప్కో షోరూమ్‌ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో కలసి మంత్రి ఆకస్మికంగా పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ చేనేత వర్గాల వారికి పూర్వవైభవం కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి చూపుతోందన్నారు. అధికారులు నాయకులు పాల్గొన్నారు.