నర్సాపురం పట్టణంలో పునః ప్రారంభించిన అన్నా క్యాంటీన్ ను సోమవారం మున్సిపల్ కమిషనర్ ఎం.అంజయ్య తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి ఆహార పదార్థాలను ఆయన పరిశీలించారు. అదేవిధంగా రూ.5కే అందిస్తున్న అల్పహారం నాణ్యత గురించి వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు. అన్నా క్యాంటీన్ నందు శుభ్రత పాటించాలని అక్కడి సిబ్బందికి సూచించారు.