ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ ఆధ్యర్యంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రావూరి కృష్ణ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఈ విధానంతో అటు ప్రజలు, ఇటు భవన కార్మికులకు ఎంతో సంతోష వ్యక్తం చేస్తున్నారని అన్నారు.