ప. గో. జిల్లాలో 22 రైతు సేవా కేంద్రాల ద్వారా 128 మంది రైతుల నుంచి 11, 770 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం భీమవరంలో ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత సీజన్లో కనీస మద్దతు ధర క్వింటాల్ సాధారణ రకం రూ. 2, 300, గ్రేడ్-ఏ రకం రూ. 2, 320 చొప్పున నిర్ణయించినట్లు తెలిపారు. ధాన్యం విక్రయాలకు సంబంధించి సమస్యలుంటే కంట్రోల్ రూం నెంబరు 8121676653కు ఫోన్ చేయాలన్నారు.