పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెరువు గ్రామంలోని స్థానిక అంగన్వాడీ కేంద్రంలో శనివారం ఏఎన్ఎం లక్ష్మి ఆధ్వర్యంలో విద్యార్థులకు హీమోగ్లోబిన్, ఎత్తు, బరువు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా శారీరక సంపూర్ణత గురించి పిల్లలకు అర్థమయ్యేలా ఏఎన్ఎం లక్ష్మి వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఏ కృష్ణ, అంగన్వాడీ టీచర్ విజయమ్మ, ఆశా సిబ్బంది పాల్గొన్నారు.