ఆక్వా రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని వారందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని ఆచంట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆదివారం ఆచంటలో ఒక ప్రకటనలో కోరారు. ఆక్వా రైతన్నను ఆదుకునేందుకు గత నాలుగు నెలల కాలంలో ప్రభుత్వం ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదన్నారు. జిల్లా ఇన్ చార్జ్ మంత్రి పర్యటనలో సైతం ఆక్వా రైతాంగానికి ప్రభుత్వం చేస్తున్న సహాయాన్ని వివరించకపోవడం శోచనీయమన్నారు.