బడా కార్పొరేట్ కంపెనీల లాభాలలో శ్రమజీవులకు న్యాయమైన వాటా దక్కే వరకూ పోరాటాలు సాగించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. సోమసుందర్ సోమవారం పిలుపునిచ్చారు.సెప్టెంబర్ 1, 2, 3, తేదీల్లో విశాఖపట్టణంలో జరగనున్న ఎఐటియుసి జాతీయ సమ్మేళనాల పోస్టర్ ను సోమవారం విడుదల చేసారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళింగ లక్ష్మణరావు, మునిసిపల్ వర్కర్స్ శ్రీనివాసరావు,తదితరులు పాల్గొన్నారు.