పాలకొల్లు డిఎన్ఆర్ మహిళా కళాశాలలో ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయం, అంతర కళాశాల మహిళా బ్యాడ్మింటన్ టోర్నమెంట్, యూనివర్సిటీ సెలక్షన్స్ గురువారం ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపల్ డా. పి. శోభారాణి మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తూ 3శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని తీర్మానించడం అభినందనీయమన్నారు. ముఖ్యఅతిథిగా గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నథానియేలు పాల్గొన్నారు.