విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు మానవత్వంతో దాతలు ముందుకు వస్తున్నారని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎఎంసి మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు రూ. 70 వేలు, భీమవరం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రూ. 50 వేలు విరాళాన్ని వరద బాధితుల సహాయార్ధం ఎమ్మెల్యే అంజిబాబుకు మంగళవారం అందించారు. దాతలను ఎమ్మెల్యే అంజిబాబు ప్రత్యేకంగా అభినందించారు.